- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగులో మాట్లాడండి.. తెలుగులో బోర్డులు పెట్టండి : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం కడపలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి శతజయంతి ముగింపు ఉత్సవాల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు హనుమచ్ఛాస్త్రి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆఫీసులు, రెస్టారెంట్లకు తెలుగులో బోర్డులు ఉండేలా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉత్తర్వులు కూడా తెలుగులోనే ఇవ్వాలని, అధికారులు, అధినేతలు తెలుగులోనే మాట్లాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి తెలుగులో మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. సీపీ బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించిన ఆయన.. అక్కడి పుస్తకాలు, తాళపత్ర గ్రంథాల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ అభివృద్ధికి స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున రూ.5 లక్షల విరాళం ప్రకటించారు.






