- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం కేసు.. ముగిసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ
లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్ : లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. సుమారు ఏడున్నర గంటలపాటు ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డిని మీడియా ప్రశ్నించగా.. లోపల ప్రశ్నలు, ఎంక్వైరీలు ఏమీ జరగలేదని బదులిచ్చారు. ఈడీ అధికారులు కేవలం తన ఫోన్ లో ఉన్న డేటా ట్రాన్స్ఫర్ కోసమే పిలిచారని తెలిపారు. వాళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తన డేటాలో ఉంటుందేమోనని డేటా తీసుకున్నారని వెల్లడించారు. లిక్కర్ స్కామ్ కేసు విచారణలో.. ఇప్పటి వరకూ తాను రాజ్ కేసిరెడ్డి పేరు తప్ప మరోపేరు చెప్పలేదని స్పష్టం చేశారు. స్కామ్ లో ఏం జరిగింది? ఎలా జరిగింది? చెప్పగలిగిన వ్యక్తి ఆయన మాత్రమేనన్నారు. సిట్ అధికారులకైనా, ఈడీ అధికారులకైనా ఇదే చెప్పానన్నారు. లిక్కర్ స్కామ్ కు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనను ఎవరు ఎలా, ఎన్ని రకాలుగా టార్గెట్ చేసినా భయపడే రకాన్ని కాదన్నారు. తిరుమల వెంకన్న సాక్షిగా తాను తప్పు చేయలేదని విజయ్ సాయి చెప్పుకొచ్చారు. కాగా.. ఇప్పటికే ఆయన రెండుసార్లు ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.






