- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ పార్టీలోకి వస్తానంటే చెప్పుతో కొడతా.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుండి వెళ్లిపోయిన వాళ్లను తిరిగి పార్టీలోకి తీసుకోబోమని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కష్టకాలంలో పార్టీ నుండి వెళ్లిపోయిన వాళ్లను తిరిగి పార్టీలోకి తీసుకోబోమని చెప్పారు. ఎవరైనా బంధు ప్రీతితో మళ్లీ పార్టీలోకి తీసుకువస్తానంటే వారిని చెప్పుతో కొడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రువు అయినా పార్టీలో చేర్చుకుంటాము కానీ వెన్నుపోటు పొడిచినవాళ్లను మాత్రం క్షమించం అని మండిపడ్డారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొంది, ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే పార్టీ మారి వెన్నుపోటు పొడిచినవాళ్లను క్షమించేది లేదని స్పష్టం చేశారు.
క్యారెక్టర్ లేని వాళ్లను, అర్హత లేనివాళ్లను పార్టీలోకి రానివ్వను అంటూ మండిపడ్డారు. బంధువులం,స్నేహం అంటూ పార్టీలోకి తిరిగి రావాలని చూసినా ఎంట్రీ ఉండదని చెప్పారు. వైసీపీకి కార్యకర్తలే ముఖ్యమని జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ధర్మవరంలో 15వేల మందికి పార్టీ పదవులు వచ్చాయని రాష్ట్రంలో మొదటిసారి ఇంతమందికి బాధ్యతలు అప్పగించామన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.






