జగన్ మోహన్ రెడ్డిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

by Ajay Maddhiboyina |

నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోద‌రుల‌తో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, మోహిత్ రెడ్డి ములాఖ‌త్ అయ్యారు.

జగన్ మోహన్ రెడ్డిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
X

దిశ‌, వెబ్ డెస్క్: నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోద‌రుల‌తో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, మోహిత్ రెడ్డి ములాఖ‌త్ అయ్యారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. నియంత‌లాగా రాష్ట్రాన్ని పరిపాలించేవారికి భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని అన్నారు. జ‌గ‌న్ దగ్గ‌ర నుండి క్యాడ‌ర్ దాకా ఏ ఒక్క‌రూ అక్ర‌మ కేసుల‌కు భ‌య‌ప‌డ‌రని చెప్పారు. న్యాయ‌స్థానాలు ఇచ్చిన ఆదేశాల‌ను సైతం అధికారుల‌కు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. కూటమి నేతల ఆదేశాలు పాటిస్తున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని అన్నారు. ఇప్పటికైనా అధికారులు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని హెచ్చ‌రించారు.

Next Story