- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబు పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల(YCP Leaders) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల(YCP Leaders) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(AP Government) పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. స్విట్జార్లాండ్‌లోని దావోస్(Dawos) లో నేడు(మంగళవారం) సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే సీఎం చంద్రబాబు పర్యటన పై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) స్పందించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పై మాజీ మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు సొంత డబ్బా మానలేదు అంటూ ఎద్దేవా చేశారు. దావోస్ లో రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం పై, మాజీ సీఎం జగన్(Former CM Jagan) పై ఇంకా బురద చల్లుతున్నారని మాజీ మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.






