‘పద్మవ్యూహం నుంచి బయటకు వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు’.. మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ ట్వీట్!

by Jakkula.Mamatha |   (  Updated:2024-12-14 14:57:45  IST  )

సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premier Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

‘పద్మవ్యూహం నుంచి బయటకు వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు’.. మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ ట్వీట్!
X

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premier Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటన పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం’’ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ట్వీట్ చేశారు. ‘పద్మవ్యూహం నుండి బయటకు వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు !’ అంటూ అల్లు అర్జున్‌ను @alluarjun ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే.. నేడు(శుక్రవారం) అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ (Chikkadpally Police Station)కు తీసుకువెళ్ళి, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బన్నీని నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరచగా.. ఇరువైపుల వాదనలు విన్న మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించే.. చివరి నిమిషంలో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.


Click Here For Tweet..

Next Story