పవన్ కళ్యాణ్ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు: విడదల రజిని

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-03 09:01:43  IST  )

ఎమ్మెల్యే మాధ‌విని టీడీపీ బ‌లిప‌శువు చేస్తోంద‌ని మాజీ మంత్రి విడద‌ల ర‌జిని అన్నారు. మ‌ళ్లీ మ‌ళ్లీ దాడులు చేస్తామ‌ని మాధ‌వి అంటున్నార‌ని, ఏపీని జంగిల్ రాజ్ గా మార్చార‌ని మండిప‌డింది.

పవన్ కళ్యాణ్ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు: విడదల రజిని
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే మాధ‌విని టీడీపీ బ‌లిప‌శువు చేస్తోంద‌ని మాజీ మంత్రి విడద‌ల ర‌జిని అన్నారు. మ‌ళ్లీ మ‌ళ్లీ దాడులు చేస్తామ‌ని మాధ‌వి అంటున్నార‌ని, ఏపీని జంగిల్ రాజ్ గా మార్చార‌ని మండిప‌డింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ చేయ‌లేని ప‌రిస్థితిలో ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. డైవ‌ర్ష‌న్ కోస‌మే మ‌ద్యం ధ‌ర‌ల‌పై ట్వీట్ చేశార‌న్నారు. కేంద్రం, ఏపీ గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల‌ని కోరారు. దాడికి గురైన వాళ్ల‌నే జైలులో పెట్టారని, దాడి చేసిన‌వాళ్ల‌కు బెయిల్ ఇస్తున్నార‌ని అన్నారు. పాల‌కులే గూండాలు రౌడీల్లా వ్య‌వ‌హరిస్తున్నార‌ని చెప్పారు.

త‌మ‌పై దాడి చేశార‌ని ఫిర్యాదు చేసినా క‌నీసం స్పంద‌న లేద‌ని అన్నారు. కూట‌మి పాల‌కుల‌కు మంచి బుద్ధి ప్ర‌సాదించాల‌ని గుడికి వెళ్లి మొక్కుకుంటే త‌ప్పా అని .. వెంకటేశ్వ‌రస్వామితో పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో మీకు బాగా తెలుసు క‌దా అని వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లు ఏ గుడికి వెళ్ల‌వ‌ద్ద‌ని చ‌ట్టం చేయాల‌న్నారు. తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంలో జ‌ర‌గ‌ని క‌ల్తీ జ‌రిగిన‌ట్టు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. కూట‌మి నేత‌ల‌ను నిల‌దీస్తున్నామ‌నే దాడులు చేస్తున్నార‌ని రాష్ట్రంలో రాజ్యాంగం లేద‌న్నారు. ప్రజాస్వామ్యం, శాంతి భ‌ద్ర‌తలు లేవ‌ని రాష్ట్రంలో రెడ్ బుక్ పాల‌సీ మ‌రియు రెడ్ బుక్ పాల‌న న‌డుస్తోంద‌ని చెప్పారు. రెడ్ బుక్ అరాచ‌కంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నార‌ని, ఎన్ని దాడులు చేసినా ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతామ‌న్నారు.

ఆలయశుద్ధి పేరుతో హైడ్రామా.. మాజీ మంత్రి విడదల రజనిపై కేసు

Next Story