ఆగస్టు 10 లోపు రోజా జైల్లో ఉంటారు : శాప్ చైర్మన్ రవినాయుడు

by Muthe.Rajitha |

ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు(Ravi Naidu) సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఆగస్టు 10 లోపు రోజా జైల్లో ఉంటారు : శాప్ చైర్మన్ రవినాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు(Ravi Naidu) సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీసీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(Roja) అతి త్వరలో జైలుకు వెళతారు అంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడాశాఖ మంత్రిగా రోజా హయాంలో జరిగిన అవినీతి బయటికి రానుందని హెచ్చరించారు. 'ఆడుదాం ఆంధ్ర..' కార్యక్రమం పేరుతో రోజా కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్నారని మండిపడ్డారు. ఈ అవినీతిపై విచారణ వేగవంతం అయిందని, వారెంట్ సిద్ధం అవుతోందని, ఆగస్టు 10 లోపు రోజా జైల్లో ఊచలు లెక్కబెట్టడం ఖాయం అన్నారు. ఇక రోజులు లెక్కబెట్టుకోవడమే మిగిలిందని రవి నాయుడు మండిపడ్డారు. భాను ప్రకాష్ పై రోజా వ్యాఖ్యలు క్షమించరానివని, దమ్ముంటే రోజా భాను ప్రకాష్ సవాల్ స్వీకరించాలని అన్నారు.

Next Story