మాజీమంత్రి నారాయణ అరెస్ట్ అవ్వడం ఖాయం : అనిల్ కుమార్ యాదవ్

by Disha Web Desk 21 |
anil kumar
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి పొంగూరు నారాయణ అరెస్ట్ అవ్వడం ఖాయమని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పోలీసులు తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో నారాయణ వణికిపోతున్నారని అన్నారు. నెల్లూరులో ఆదివారం ఉదయం మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. పేదల భూములు కొట్టేసిన మాజీమంత్రి నారాయణ సత్యహరిశ్చంద్రుడా అని ప్రశ్నించారు. త్వరలోనే మాజీమంత్రి నారాయణ అక్రమాలన్నీ బయటపడతాయని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి నారాయణ వేల కోట్లు దోచేసుకున్నారని ఆరోపించారు. రూ.800 కోట్ల పేదల అసైన్డ్‌ భూములు నారాయణ దోచేశారు అని ఆరోపించారు. నారాయణ అక్రమాలు అన్నీ ఇన్నీ కావని అవన్నీ బయటపడతాయన్నారు. చంద్రబాబుతో మాజీమంత్రి నారాయణ ములాఖత్‌పై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. విచారణకు సహకరించకూడదని ఇద్దరూ మాట్లాడుకున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, నారాయణల చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైందని అన్నారు. మోత మోగిద్దాం కార్యక్రమంలో బాగంగా టీడీపీ నేతలు గంటలు కొట్టడం దేవుడి స్క్రిప్ట్ అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌పైనా సెటర్లు వేశారు. నారా లోకేశ్‌ను ఒక పులకేశిగా అభివర్ణించారు. ఢిల్లీలో న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు టీడీపీ శ్రేణులు బిల్డప్ ఇస్తున్నారని వాస్తవానికి ఐఆర్ఆర్ కేసులో దొరక్కుండా దొంగలా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. అయినప్పటికీ సీఐడీ అధికారులు పట్టుకుని నోటీసులు ఇచ్చారని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed