రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది : మాజీ మంత్రి మేరుగు నాగార్జున

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున (Merugu Nagarjuna) ఆరోపించారు.

రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది : మాజీ మంత్రి మేరుగు నాగార్జున
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున (Merugu Nagarjuna) ఆరోపించారు. మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావుపై (Bonigala Nagamalleswara Rao) జరిగిన దాడికి సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దళితవర్గాలు రాజకీయంగా ఎదగడం చంద్రబాబుకు ఇష్టం లేదని, ఏపీలో ఎక్కడచూసినా దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. అలాగే సింగయ్య మృతిపై కూడా సీఎం చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.

గురువారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ట్రాక్టర్ కు మరమ్మతులు చేయించుకునే క్రమంలో కట్టెంపూడి గ్రామం సమీపంలో ఉన్న ఓ టీ స్టాల్ కు వెళ్లి టీ తాగుతుండగా.. నాగమల్లేశ్వరరావుపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన ఘటన సీసీ టీవీలో రికార్డయింది. మన్నవ గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, ప్రశ్నించినవారిపైనే దాడి చేయడం టార్గెట్ గా పెట్టుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధులపై దాడులు చేస్తూ.. గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.

Next Story