జైలు నుంచి విడుదలైన కాకాణి.. సోమిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-20 05:44:34  IST  )

వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.

జైలు నుంచి విడుదలైన కాకాణి.. సోమిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (Kakani Govardhan Bail) నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి రిలీజయ్యారు. కాకాణి జైలు నుంచి బయటకు రావడంతోనే జిల్లా నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. క్వార్జ్ అక్రమ తవ్వకాలు, గిజనులను కులం పేరుతో దూషించిన కేసుల్లో ఏ4గా ఉన్న కాకాణికి ఏపీ హైకోర్టు (AP High Court) సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తులు రెండు, ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి 5 గంటల్లోగా ఐఓ ముందు హాజరవ్వడం, దర్యాప్తు పూర్తయ్యే వరకు జిల్లాలో పర్యటించే వీల్లేదని, ఐఓ అనుమతి లేకుండా తెలుగు రాష్ట్రాలు దాటి వెళ్లరాదని షరతులు విధించింది. అలాగే పాస్ పోర్టును అధికారులకు అప్పగించాలని సూచించింది.

జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన కాకాణి.. తనపై చిత్రవిచిత్రమైన కేసులు పెట్టారని, ఏడు పీటీ వారెంట్లు వేశారని తెలిపారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు జైళ్లు అడ్డంకి కావన్నారు. ఇక సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతి మితిమీరిపోతోందని, అతను చేస్తోన్న దొపిడీని అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Next Story