Andhra News : జగన్ మానసిక పరిస్థితి ఏం బాలేదు : మాజీ మంత్రి విమర్శలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-03 08:11:53  IST  )

జగన్ మానసిక పరిస్థితి ఏం బాలేదని, ఈ విషయంపై ఒకసారి చూపించుకుంటే మంచిదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు.

Andhra News : జగన్ మానసిక పరిస్థితి ఏం బాలేదు : మాజీ మంత్రి విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం జగన్ మానసిక పరిస్థితిపై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా ఉందో లేదో ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. గతంలో విశాఖను రాజధానిగా చేస్తామన్న జగన్.. ఇప్పుడు మావిగన్ అని కొత్త స్వరం అందుకున్నారని విమర్శించారు. ఆయన మానసిక పరిస్థితి ఏం బాలేదని, అందుకే రాజధానిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎర్రబస్సు కూడా రనిచోటకు ఎయిర్ బస్సు ఎందుకన్న జగన్.. ఇప్పుడు భోగాపురం ఎయిర్ పోర్టును తీసుకొచ్చింది తామేనని చెప్పుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్నగాక మొన్న శంకుస్థాపన చేసిన ఆర్సెలార్ మిత్తల్ కంపెనీని కూడా తానే తెచ్చానని చెప్పుకుంటున్నారన్నారు. వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా.. జగన్ లో ఇంకా మార్పురాలేదన్నారు. త్వరలోనే వైసీపీ రాష్ట్రంలో కనుమరుగవ్వడం ఖాయమని గంటా పేర్కొన్నారు.

ఇక ఈ నెలలోనే రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన జరగనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. జూన్ నెలలో భోగాపురం ఎయిర్ పోర్టు లాంఛనంగా ప్రారంభమై.. అందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఎయిర్ పోర్టు ప్రారంభమయ్యాక ఉత్తరాంధ్ర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు. అమరావతి బిల్లుకు పార్లమెంటులో సహకరించిన పార్టీలన్నింటికీ ధన్యవాదాలు తెలిపారు.

అమరావతి అన్‌స్టాపబుల్ : ఆత్మగౌరవ ప్రస్థానం నుంచి అఖండ విజయం వరకూ

Next Story