- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ ర్యాలీ.. పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం
by Naga Rani Yarlagadda |
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. నేడు 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయాలని వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. నేడు 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయాలని వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నియోజకవర్గాల్లో కీలక నేతల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరిట ర్యాలీలు నిర్వహించారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.
స్వామి థియేటర్ వద్ద ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకోగా.. అంబటి రాంబాబు.. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుతో వాగ్వాదానికి దిగారు. ఒకరికొకరు వేళ్లు చూపించుకుంటూ దుర్భాలాడినట్లు సమాచారం. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Next Story






