YS Jagan:‘ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి అసలు కారణం ఇదే!’.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM Jagan) కూటమి ప్రభుత్వం(AP Government) మరోసారి విమర్శలు గుప్పించారు.

YS Jagan:‘ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి అసలు కారణం ఇదే!’.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM Jagan) కూటమి ప్రభుత్వం(AP Government) మరోసారి విమర్శలు గుప్పించారు. నేడు(గురువారం) వైసీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎప్పుడు అమలు చేస్తారని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతోందని.. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిటి? అని నిలదీశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే ప్రతిపక్ష హోదా అంశంపై ఇదివరకే మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడిని విజ్ఞప్తి చేశారు. అయితే.. శాసనసభ ఎమ్మెల్యేల నిష్పత్తి ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 సీట్లు రావాల్సి ఉంది. కానీ సాధారణ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో నిబంధనల ప్రకారమే వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాను కోల్పోయారు. కానీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ కోరారు.

ఇదే అంశం పై మరోసారి మాజీ సీఎం జగన్ స్పందించారు. అసెంబ్లీకి హాజరు పై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మాట్లాడటానికి సమయం ఇస్తేనే కదా అసెంబ్లీకి వెళ్లేది. సాధారణ ఎమ్మెల్యే లాగా నాకూ అంతే టైమ్ ఇస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో పాలక పక్షం, ప్రతిపక్షం రెండే ఉంటాయి. ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు ఉన్న ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఆ హోదా ఇస్తే నాకు చంద్రబాబు అంత సమయం ఇవ్వాల్సి ఉంటుందని హోదా ఇవ్వట్లేదు’’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

Next Story