YS Jagan:సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా.. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై మాజీ సీఎం జగన్(Former CM Jagan) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

YS Jagan:సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా.. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై మాజీ సీఎం జగన్(Former CM Jagan) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్(YS Jagan) సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జనవరి మూడో వారం నుంచి తాను జిల్లాల్లో పర్యటిస్తానని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆయన నేడు(గురువారం) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆరు నెలల ప్రభుత్వ పాలన వేగంగా గడిచిపోయిందన్నారు. ప్రజల తరఫున గళం వినిపించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు తోడుగా, అండగా ఉండాలని పార్టీ నేతలకు(YCP Leaders) దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజులు(బుధ, గురువారం) పర్యటించి అక్కడే బస చేస్తానని చెప్పారు. కార్యకర్తలతో మమేకం అవుతానన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేలా పనిచేయాలని నేతలకు సూచించారు.

Next Story