అసలు పరిపాలన అంటే మీకు తెలుసా? చంద్రబాబుపై జగన్ ఫైర్

by Ajay Maddhiboyina |

విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో 12 గంటల పాటు కరెంట్ పోవడంపై ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్ స్పందించారు. అసలు పరిపాలన అంటే మీకు తెలుసా అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.

అసలు పరిపాలన అంటే మీకు తెలుసా? చంద్రబాబుపై జగన్ ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో 12 గంటల పాటు కరెంట్ పోవడంపై ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్ స్పందించారు. అసలు పరిపాలన అంటే మీకు తెలుసా అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా? అని నిలదీశారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్‌ ఆస్పత్రిని నిర్వహించలేని దౌర్భాగ్యస్థితిలో మీరు ఉన్నారని పేర్కొన్నారు. విజన్‌ గురించి, ఆన్లైన్‌ పరిపాలన గురించి సచివాలయంలో కూర్చుని మీరు రొటీన్‌ డైలాగులు చెప్తున్న పరిణామాల మధ్య, ఈ పెద్దాసుపత్రిలో కరెంటు పోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? ఇంత నిర్లక్ష్యం దేనికి? అని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పట్లు చేయాలన్న కనీస స్పృహ మీ ప్ర‌భుత్వానికి లేదా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2వేల ప‌డ‌క‌లు ఉన్న ఆస్ప‌త్రిలో 17,00 మంది పేషంట్లు ఉన్నార‌ని, అలాంటి ఆస్ప‌త్రిని నిర్వ‌హించే ప‌ద్ధ‌తి ఇదేనా అని అడిగారు. tweet

Next Story