- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊర్లలో మా కార్యకర్తలను తరిమికొడుతున్నారు: జగన్
పల్నాడులోని పిన్నెల్లి గ్రామంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: పల్నాడులోని పిన్నెల్లి గ్రామంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలను ఊర్ల నుండి తరిమికొడుతున్నారని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం తారాస్థాయికి చేరిందని వ్యాఖ్యానించారు. ముగ్గురు ఎంపీటీసీలు, సర్పంచ్ వారితో పాటు 300 కుటుంబాలు ఊర్లను విడిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
ఊర్లో తిరిగి ప్రవేశించడం కోసం కోర్టులను ఆశ్రయించే పరిస్థితి వచ్చిందన్నారు. సాల్మన్ అనే కార్యకర్త తన భార్య అనారోగ్యం పాలవ్వడంతో చూడ్డానికి వెళితే రాడ్లతో కొట్టి చంపారని ఆరోపించారు. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు చేసేందుకు వెళితే పోలీసులు కూడా అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎన్ హెచ్ ఆర్సీ ద్వారా కోర్టులకు వెళ్లి పోలీసులపై ఒత్తిడి తెస్తామని అన్నారు. వాళ్లకు కూడా మంచి రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు.






