- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్..రెండు నెలలుగా పరారీలో ఉన్న నేత
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. క్వార్జ్ అక్రమ తవ్వకాలు

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. క్వార్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా మరియు నిబంధనలకు విరుద్దంగా పేలుడు పధార్థాల వినియోగంపై పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో కాకానిపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. అయితే గత కొంతకాలంగా ఆయన పరారీలో ఉండగా నేడు అదుపులోకి తీసుకున్నారు.
అంతే కాకుండా రేపు ఉదయం ఆయనను ఏపీకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలోని వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమి అక్రమించి క్వార్జ్ ఖనిజాన్ని కాకాని అక్రమ తవ్వకాలు జరిపి అమ్ముకున్నారని మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కాకాని నాలుగో నింధితుడిగా ఉన్నారు. ఇప్పటికే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించినా ఆయనకు ఊరట లభించలేదు. దీంతో రెండు నెలలుగా ఆయన పరారీలోనే ఉన్నారు.






