వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలకు సర్వం సిద్ధం.. రీల్స్‌తో హంగామా

by Vemula.Srinu Prasad |

వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలకు సర్వం సిద్ధం చేశారు...

వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలకు సర్వం సిద్ధం.. రీల్స్‌తో  హంగామా
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ పుట్టినరోజు వేడుకలకు సర్వంసిద్ధమైంది. డిసెంబర్ 21, 1972లో ఆయన జన్మించారు. ఆదివారం పుట్టిన రోజు వేడులకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో సంబరాల్లో మునిగితేలుతున్నాయి. డిసెంబర్ నెల ప్రారంభం నుంచి ప్రతిరోజు జగన్‌కు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా కేక్ కటింగ్ చేస్తున్నారు. జగన్ పుట్టినరోజు వేడుకలపై రీల్స్‌తో వైసీపీ సోషల్ మీడియా ఒక రేంజ్‌లో హంగామా చేస్తుంది. వైసీపీ సోషల్ మీడియాపై ప్రధాని మోడీ వ్యాఖ్యల తర్వాత మరింత యాక్టివేట్ అయింది. అందులోనూ పార్టీ అధ్యక్షుడు పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా జగన్ పాటలు, డైలాగ్స్, రీల్స్, షాట్స్‌తో హోరెత్తుతోంది. విదేశాల్లోనూ వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

Next Story