కాసేపట్లో నీట్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

by Vemula.Srinu Prasad |

NTA ఆధ్వర్యంలో జరగనున్న నీట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది..

కాసేపట్లో నీట్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
X

దిశ, వెబ్ డెస్క్: NTA ఆధ్వర్యంలో జరగనున్న నీట్ పరీక్షల(NEET Exams)కు సర్వం సిద్ధమైంది. దీంతో ఏపీ(Ap)లోని పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రతతో పాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 65 వేలకు పైగా విద్యార్థులు(Students) నీట్ రాయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష జరగనుంది. కఠిన ఆంక్షల నడుమ నీట్ నిర్వహిస్తున్నారు. విజయవాడ(Vijayawada), కర్నూలు(Kurnool), తిరుపతి(Tirupati), విశాఖ(Visakha), అనంతపురం(Ananthapuram), గుంటూరు(Guntur)లో నీట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి నీట్ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తున్నారు. విద్యార్థులు ధరించే దుస్తుల నుంచి గోల్డ్, పాదరక్షలు వరకు తనిఖీ చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నారు.

Next Story