- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Visakha: ఐపీఎల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం
విశాఖ వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు సర్వంసిద్ధమైంది...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha) వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్(IPL match)కు సర్వంసిద్ధమైంది. ఢిల్లీ కేపిటల్స్, సన్ రైజర్స్(Delhi Capitals, Sunrisers) మధ్య పీఎంపాలెం వీసీడీఏలో ఆదివారం మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు విశాఖకు చేరుకున్నాయి. ఉగాది పండగ కావడంతో మ్యాచ్ తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. నగరంలో పోలీసులు భారీగా బందో బస్తు ఏర్పాటు చేశారు. అటు స్టేడియం వద్దకు ఇప్పటికే బలగాలు భారీగా చేరుకున్నారు. 1700 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం వైపు వెళ్లే వాహనాలను ఇతర ప్రాంతాల్లో అనుమతించారు. వెహికల్స్ పార్కింగ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి నుంచి విశాఖ నగరంలోకి వచ్చే, పోయే వాహనాలను సైతం దారి మళ్లించారు.






