అమరావతిలో వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు.. సర్వంసిద్ధం

by Vemula.Srinu Prasad |

అమరావతిలో వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటుకు సర్వంసిద్ధమైంది...

అమరావతిలో వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు.. సర్వంసిద్ధం
X

దిశ, వెబ్ డెస్క్: వాజపేయి(Vajpayee) శత జయంతి సందర్భంగా గురువారం అమరావతి(Amaravati)లో స్మృతి వనతో పాటు విగ్రహాన్ని‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu)తో పాటు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Union Minister Shivraj Singh Chouhan), ఇతర రాష్ట్రమంత్రులు పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి సర్వం సిద్ధమైంది. 14 అడుగుల ఎత్తులో కాంస్యంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న తొలి విగ్రహం వాజ్ పేయిదే కావడం విశేషం. కాగా వాజ్ పేయీ శజయంతి ఉత్సవాల సందర్భంగా ధర్మవరం నుంచి చేపట్టిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర అమరావతి వరకు జరిగింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే తేడా లేకుండా ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.

ఇక వాయిపేయి విగ్రహం ఆవిష్కరణ తర్వాత సీఎం చంద్రబాబు TDP కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. అనంతరం అందుబాటులో ఉన్న నేతలతో సీఎం చంద్రబాబు భేటీకానున్నారు.

Next Story