- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఐఐ సదస్సుకు సర్వం సిద్ధం.. విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు
విశాఖ (Vishakha)లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ మైదానం వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ (CII) సదస్సుకు సర్వం సిద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ (Vishakha)లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ మైదానం వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ (CII) సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే వైజాక్ సిటీ ప్రధాన మార్గాలన్నీ విద్యు్ద్దీపాలతో కలకలలాడుతున్నాయి. ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేసిన ఆకర్షణీయ ఫౌంటెన్‌లు, ఇతర అలంకరణ వస్తువులు ప్రజలను కనువిందు చేస్తున్నాయి. సీఐఐ సదస్సుకు 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రధాన వేదికతో పాటు ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధం చేస్తున్నారు. సీఎంతో పాటు గవర్నర్, ఉప రాష్ట్రపతి ఆయా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక సీఐఐ సదస్సు నేపథ్యంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇవాళ రాత్రి విశాఖ చేరుకున్నారు. అతిథులకు నోవాటెల్ హోటల్‌లో విందు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.






