నాగబాబు MLC నామినేషన్ పత్రాలు రెడీ.. దాఖలుకు ముహూర్తం ఫిక్స్

by Vemula.Srinu Prasad |

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేసేందుకు సర్వం సిద్ధమైంది....

నాగబాబు MLC నామినేషన్ పత్రాలు రెడీ.. దాఖలుకు ముహూర్తం ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు(MLA quota MLC elections) ఈ నెల 20న జరగనున్నాయి. దీంతో నామినేషన్ల ఘట్టం ప్రారంభంకానుంది. జనసేన తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇప్పటికే పవన్ కల్యాణ్(Pawan Kalyan)సోదరుడు నాగబాబు(Nagababu) ఖరారు అయిన విషయం తెలిసిందే. అయితే నాగబాబు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నాగబాబు నామినేషన్ దాఖలు చేసేందుకు పార్టీ నయాకుడు సర్వం సిద్ధం చేశారు. 10 మంది ఎమ్మెల్యేల సంతకాలతో నాగబాబు ఎమ్మెల్సీ నామినేషన్ పత్రాలు రెడీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నాగబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు జనసేన నేతలు, కార్యకర్తలు నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో భారీగా పాల్గొనాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 10వ తేదీ వరకూ నామినేషన్ దాఖలు కార్యక్రమం, 11న పరిశీలన, 13న ఉపసంహరణ, 20 పోలింగ్ ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. జనసేన నుంచి నాగబాబు బరిలో దిగుతున్నారు.

Next Story