- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నంద్యాలకు సీఎం చంద్రబాబు.. పర్యటనకు సర్వంసిద్ధం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం అమరావతి ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరి డోన్ మండలం కొత్తబురుజుకు చేరుకుంటారు...

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) నంద్యాల పర్యటన(Nandyal tour)కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం అమరావతి ఉండవల్లి నివాసం(Amaravati Undavalli Residence) నుంచి బయల్దేరి డోన్ మండలం కొత్తబురుజుకు చేరుకుంటారు. ఆ తర్వాత గ్రామ సభలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అక్కడ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు(Farmers Pattadar Passbooks) పంపిణీ చేశారు. అనంతరం ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పొలాలు పరిశీలించి, రైతులతో మాట్లాడతారు. 2.40 గంటలకు పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం నంద్యాల పర్యటనను ముగించుకుని తిరిగి సాయంత్రం 4.20 గంటలకు ఉండవల్లికి చేరుకుంటారు. ఈ మేరకు పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పటిష్ట భద్రత నడుమ మధ్య చంద్రబాబు పర్యటన జరగనుంది. నంద్యాల పర్యటన ముగించుకుని ఉండవల్లి చేరుకునే వరకూ ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు పోలీసులు.






