- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్రతి యువకుడు కలాం కలలు నెరవేర్చే దిశగా అడుగులు వేయాలి’: Nara Lokesh
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి(జూలై 27) సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన సేవలను స్మరించుకున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి(జూలై 27) సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ క్రమంలో ‘‘భారత జాతి గర్వించదగ్గ గొప్ప మేధావి ఏపీజే అబ్దుల్ కలాం. ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరు గడించారు. ఆ మహనీయుడికి హృదయపూర్వక నివాళులు. కలాం శాస్త్రవేత్త దేశానికి చేసిన సేవలు అమూల్యమైనవి. శాస్త్ర విజ్ఞానంలో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తిగా ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. తనదైన వ్యక్తిత్వం, ప్రసంగాలతో లక్షలాది మంది లో స్ఫూర్తి నింపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేద్దాం. ప్రతి యువకుడు కలాం కలలు నెరవేర్చే దిశగా అడుగులు వేయాలి’’ అని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
అలాగే, శాస్త్రవేత్తగా దేశ అణు, శాస్త్రీయ రంగాలకు మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు, ప్రజల రాష్ట్రపతి డా.ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత మానవతావాది సేవలను స్మరించుకుందాం అని ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.






