నడుములోతు నీళ్లలో పంట పొలాలు.. మూడు రోజులుగా దారుణ పరిస్థితులు

by Vemula.Srinu Prasad |

శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినా రైతులు నానా తంటాలు పడుతున్నారు...

నడుములోతు నీళ్లలో పంట పొలాలు.. మూడు రోజులుగా దారుణ పరిస్థితులు
X


దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srikakulam)లో వర్షాలు తగ్గుముఖం పట్టినా రైతులు నానా తంటాలు పడుతున్నారు. మూడు రోజుల క్రితం వర్షాలు దంచి కొట్టాయి. దీంతో నదులు, వాగులు, వంకలు పొంగిపార్లాయి. వంశధార, నాగావళి నదులు ఉప్పొంగి ప్రవాహించాయి. దీంతో సమీప ప్రాంత పంటపొలాల్లోకి నడుములోతు నీళ్లు చేరాయి. హిరమండలం(Hiramandalam)లో నాలుగు అడుగులకు పైగా పెరిగిన వరి చేలల్లో కూడా వరద నీరు ముంచెత్తింది. మూడు రోజులు అవుతున్నా పొలాల్లో తగ్గకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ తమను ఎవరూ పరామర్శించలేదని వాపోయారు. ఇంత కష్టంలో ఉన్న తమను ఆదుకోవాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 8 వేల ఎకరాల్లో పంట జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. మరి నాయకులు, అధికారులు స్పందిస్తారేమో చూడాలి.

Next Story