Kishan reddy: దక్షిణాదినా.. బీజేపీ జెండా ఎగరేస్తాం..

by Thanuru Gopichand |

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో బీజేపీ జెండా ఎగురవేస్తామని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు.

Kishan reddy: దక్షిణాదినా.. బీజేపీ జెండా ఎగరేస్తాం..
X

ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఆ మూడు రాష్ట్రాల్లో గెలుస్తాం..

అంబేద్కర్కు భారతరత్న ఇచ్చిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే

విజయవాడలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పర్యటన

దిశ, డైనమిక్​ బ్యూరో: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో బీజేపీ జెండా ఎగురవేస్తామని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన విజయవాడలో పర్యటించారు. తొలుత ఎస్​కన్వెన్షన్​లో ప్రధాని మోదీ (Narendra modi)మన్​కీ బాత్​ను విన్నారు. అనంతరం అంబేద్కర్​(BR Ambdkar) జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన మేధావుల సదస్సులో కిషన్​రెడ్డి మాట్లాడారు. మోదీ నాయకత్వంలో దక్షిణ భారత దేశానికి ఎటువంటి అన్యాయం జరగబోదన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడి ప్రజలకు మేలు చేసి, వారి గుండెల్లో చోటు సంపాదించి దక్షిణాదిన బీజేపీ (BJP) జెండా ఎగురవేస్తామన్నారు. గత కాంగ్రెస్​ప్రభుత్వ హయాంలోనే రిలయన్స్​, అదానీ , టాటా వచ్చారని.. వారి చేతిలోనే దేశ సంపద ఉందని ఇప్పుడు రాహుల్​గాంధీ చెప్పడం శోచనీయం అన్నారు. మొదటిసారి మోడీ ప్రధాని అయ్యాక రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన అభివృద్ధి పోటీ వచ్చిందని, దీనిని చూసి ఓర్వలేక కాంగ్రెస్, కమ్యూనిస్టులు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​కు భారతరత్న ఇచ్చిన ప్రభుత్వం బీజేపీ అని గుర్తు చేశారు. భారత దేశం కులం, మతం పేరిట విడిపోవాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదన్నారు. ప్రజలంతా కలసికట్టుగా ఉండాలని ఆయన ఆకాక్షించారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితోనే బీజేపీ ప్రభుత్వం పాలన చేస్తోందని అన్నారు. త్వరలో ముంబైలో భారీ అంబేద్కర్​విగ్రహాన్ని నెలకొల్పుతామని చెప్పారు.

అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న రాష్ట్రానికి రానున్న సందర్భం పురస్కరించుకొని విజయవాడలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు, సభ నిర్వహణపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్​యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ , పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ తో కలసి బీజేపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలోని అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. సాయంత్రం మంత్రి సత్యకుమార్​ యాదవ్​ రచించిన సత్యకాలమ్​పుస్తకాన్ని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్​తో పాటు, పల్లా శ్రీనివాసరావు పాల్గొంటారు.

Next Story