- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చనిపోయినా గుర్తుండాలి.. అదే నిజమైన జీవితం... సీఎం చంద్రబాబు నాయుడు
మనుషులై పుట్టిన తర్వాత మనం చనిపోవడం ఎప్పుడోసారి ఖాయం.. మనం చనిపోయిన తర్వాత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా బతకాల్సిన అవసరం ఉంది..

దిశ, డైనమిక్ బ్యూరో : మనుషులై పుట్టిన తర్వాత మనం చనిపోవడం ఎప్పుడోసారి ఖాయం.. మనం చనిపోయిన తర్వాత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా బతకాల్సిన అవసరం ఉంది.. అదే నిజమైన జీవితం అని ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు అన్నారు. ఏపీలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 అమలు కార్యక్రమాన్ని మంళగిరిలో ఈరోజు సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బంగారు కుటుంబాలు- మార్గదర్శులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఉగాది రోజు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. మార్గద ర్శలుగా 1.40 లక్షల మంది పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. వీరిలో కొంతమందిని ఈ రోజు పరిచయం చేశారు. బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ప్రజల సమస్య లను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గతంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నారు. వారిని దత్తత తీసుకుం టున్నట్టు సంకేతంగా అడాప్ట్ ట్రీని బంగారు కుటుంబాలకు సీఎం ఈ రోజు అందజేశారు.






