‘వైఎస్ జగన్‌కు ఉన్న క్రేజ్ హీరోలకు కూడా లేదు’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

మాజీ సీఎం వైఎస్ జగన్‌(Former CM YS Jagan)కు ఉన్న క్రేజ్ సినిమా హీరోలకు కూడా లేదని వైసీపీ నేత(YCP Leader) కన్నబాబు(Kannababu) అన్నారు.

‘వైఎస్ జగన్‌కు ఉన్న క్రేజ్ హీరోలకు కూడా లేదు’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: మాజీ సీఎం వైఎస్ జగన్‌(Former CM YS Jagan)కు ఉన్న క్రేజ్ సినిమా హీరోలకు కూడా లేదని వైసీపీ నేత(YCP Leader) కన్నబాబు(Kannababu) అన్నారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డీనేటర్‌గా వైసీపీ నేత, కురుసాల కన్నబాబు నేడు(ఆదివారం) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. నాకు బాధ్యత అప్పగించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతంతో నాకు ఎంతో అనుబంధం ఉందన్నారు.

ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం(AP Government) పై విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ప్రజల్లో విశ్వసం కోల్పోయిందన్నారు. ప్రజలను జగన్ మోసం చేయాలంటే సూపర్ సిక్స్(Supersix) కాదు.. సూపర్ 60 ఇచ్చేవారు అని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని వ్యాఖ్యానించారు. గ్రూప్-2 అభ్యర్థులను సీఎం చంద్రబాబు(CM Chandrababu) మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ జనసంద్రమేనని చెప్పారు.

సినిమా హీరోలకు ఉన్న క్రేజీ జగన్‌కు ఉందన్నారు. విజయవాడ(Vijayawada)లో వల్లభనేని వంశీ(Vallabhaneni vamshi)ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు, పాలకొండ పర్యటనలో జగన్‌ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఈ జన ప్రభంజనాన్ని చూసి కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు. తాము ఓడిన.. పార్టీ చాలా బలంగా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణ దాస్, ఎంపీ తనూజ రాణి, గుడివాడ అమర్నాథ్, వరుదు కళ్యాణి, ధర్మశ్రీ, కేకే రాజు, పండుల రవీంద్ర బాబు సహా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story