- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుపై మరో ఏపీ నేత బాగోతం.. ఈసారి ఆ పార్టీపై తీవ్ర విమర్శలు..!
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఘటన మర్చిపోకముందే మరో నేత బాగోతం బయటకు వెళ్లింది...

దిశ, వెబ్ డెస్క్: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Railway Kodur MLA Arava Sridhar) ఘటన మర్చిపోకముందే మరో నేత బాగోతం బయటకు వెళ్లింది. అయితే ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్(YSR Congress) పార్టీ నేతపై జరిగిన దాడితో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుపతి సమీపం ఉప్పరపల్లిలో వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి(YCP Publicity Wing Working President Hariprasad Reddy).. మహీంధ్ర థార్ కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి సడెన్‌గా అడ్డగించారు. కారులో ఉన్న తన భార్యను కిందకు దించి దాడి చేశారు. అనంతరం చెప్పుతో హరిప్రసాద్ రెడ్డిని కొట్టారు. కారును సైతం ధ్వంసం చేశారు. అయితే హరిప్రసాద్ రెడ్డిపై భర్త దాడి చేస్తుంటే ఆపేందుకు భార్య ప్రయత్నం చేసింది. అయినా సరే హరిప్రసాద్ రెడ్డిపై భర్త పదే పదే దాడి చేశారు. అనంతరం తన భార్యను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మహిళ భర్త తిరుపతిలోని ఓ గ్రామ సర్పంచ్ అని తెలిపింది.
వివాహేతర సంబంధమేనా..?
అయితే ఆ మహిళకు, హరిప్రసాద్ రెడ్డికి వివాహేతర సంబంధం ఉన్న కారణంతో భర్త దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతగా దాడి జరుగుతున్నా హరిప్రసాద్ రెడ్డి మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. దాడిపై ఏమాత్రం స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే హరిప్రసాద్ రెడ్డిపై దాడి చేసిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో హరిప్రసాద్ రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా కొందరు నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. పార్టీలు ఏవైనా నేతలంతా ఎందుకు ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. నేతలు పార్టీ పరువు తీస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా నాయకులు హుందాగా ఉండాలని సూచిస్తున్నారు.
తెగిపోతున్న కుటుంబ బాంధవ్యాలు
ఏది ఏమైనప్పటికీ వివాహేతర సంబంధాలు కుటుంబ బాంధవ్యాలను దెబ్బతీస్తున్నాయి. భార్యభర్తల మధ్య చిచ్చుపెడుతున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పెచ్చుమీరుతున్నాయి. మరి హరిప్రసాద్ రెడ్డి వ్యవహారంలో పూర్తి వివరాలు బయటకు తెలియాల్సి ఉంది. వివాహేతర సంబంధమేనా లేదా ఇంకో కారణమేదైనా ఉందనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.






