శ్రీవారిని దర్శించుకున్న ESL నరసింహన్.. పలువురు ప్రముఖులు

by Kema Shiva Kumar |

అభిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామిని ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ (ESL Narasimhan) దంపతులు, డీఆర్‌డీఏ మాజీ డైరెక్టర్ జనరల్ సతీష్ రెడ్డి (Sathish Reddy), ప్రముఖ క్రికెటర్, కర్ణ్ శర్మ (Karn Sharma), కేంద్ర మంత్రి కృష్ణన్ పాల్ గుర్జార్, నటుడు ఆకాష్ దాస్ నాయక్‌లు వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా దర్శింకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న ESL నరసింహన్.. పలువురు ప్రముఖులు
X

దిశ, వెబ్‌డెస్క్: అభిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామిని ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ (ESL Narasimhan) దంపతులు, డీఆర్‌డీఏ మాజీ డైరెక్టర్ జనరల్ సతీష్ రెడ్డి (Sathish Reddy), ప్రముఖ క్రికెటర్, కర్ణ్ శర్మ (Karn Sharma), కేంద్ర మంత్రి కృష్ణన్ పాల్ గుర్జార్, నటుడు ఆకాష్ దాస్ నాయక్‌లు వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా దర్శింకున్నారు. ఈ మేరకు వారికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు.. వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులకు 20 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ప్రస్తుతం నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్‌ కొనసాగుతోంది.

Next Story