రెచ్చిపోయిన దొంగలు.. వృద్ధురాలి కళ్లల్లో కారం చల్లి..?

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.

రెచ్చిపోయిన దొంగలు.. వృద్ధురాలి కళ్లల్లో కారం చల్లి..?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇటీవల ఏపీ(Andhra Pradesh)లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. రాత్రి సమయాల్లోనే కాదు పట్టపగలు కూడా దొంగలు హల్‌చల్ సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుంచి గొలుసు అపహరించారు. జిల్లా(Guntur District)లోని మంగళగిరి(Mangalagiri) పట్టణంలోని రత్నాల చెరువులో సరోజినీ అనే వృద్ధురాలు నిన్న(బుధవారం) రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. ఈ క్రమంలో వృద్ధురాలి కంట్లో కారం చల్లి మెడలోని బంగారు గొలుసును లాక్కొని వెళ్ళారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story