పిల్లలకు హిందీ కంటే ఇంగ్లీష్ ముఖ్యం : జగన్

by Muthe.Rajitha |

నేటితరం పిల్లలకు ఇంగ్లీష్ ముఖ్యమని వైస్సార్సీపీ(YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పేర్కొన్నారు.

పిల్లలకు హిందీ కంటే ఇంగ్లీష్ ముఖ్యం : జగన్
X

దిశ, వెబ్ డెస్క్ : నేటితరం పిల్లలకు ఇంగ్లీష్ ముఖ్యమని వైస్సార్సీపీ(YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పేర్కొన్నారు. హిందీ జాతీయ భాష అయినప్పటికీ ఇంగ్లీష్(English) అంతకంటే ముఖ్యం అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోకపోయినా, మాట్లాడకపోయినా ప్రపంచంతో పోటీ పడలేరని అన్నారు. చదివేది ఇంగ్లీష్ మీడియం అయితే పిల్లలు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అని నచ్చిన భాష నేర్చుకోవచ్చని తెలిపారు. ఆయా రాష్ట్రాల మాతృభాష ఖచ్చితంగా ఫస్ట్ లాంగ్వేజ్ ఉండాలని, సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉండాలని సూచించారు. అయితే ఇటీవల ఏపీ కూటమి నాయకులూ హిందీ తప్పనిసరి నేర్చుకోవాలని సూచిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story