- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijayawada:ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి
విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారిని ఏపీ(Andhra Pradesh) దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddy) ఇవాళ(సోమవారం) దర్శించుకున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారిని ఏపీ(Andhra Pradesh) దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddy) ఇవాళ(సోమవారం) దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయ ఈవో, అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వేద పండితులు వేదాశీర్వచనం చేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు.
అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారి ఆలయంలో పెండింగ్‌లో ఉన్న మాస్టర్ ప్లాన్ పై, కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీం పనుల పురోగతిపై, పలు అభివృద్ధి పనుల పై సమీక్షించారు. ఈ సమావేశంలో ఆలయ మౌలిక వసతుల అభివృద్ధి పై దృష్టిసారించారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వినయ్ చంద్, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఈవో శీనా నాయక్, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






