‘‘ఆ స్థలం ఖాళీ చేయండి’’.. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి నోటీసులు... ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2025-04-16 12:18:24.0  )
‘‘ఆ స్థలం ఖాళీ చేయండి’’.. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి నోటీసులు... ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Former Minister Peddireddy Ramachandra Reddy)కి దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. తిరుపతి రాయల్ నగర్ ప్రాంతం(Tirupati Royal Nagar area) బుగ్గమఠం(Bugga Matham) స్థలాన్ని ఖాళీ చేయాలని పేర్కొన్నారు. తమ స్థలాన్నిపెద్దిరెడ్డి ఆక్రమించారంటూ బుగ్గమఠం నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనకు ఈ నెల 11న నోటీసులు జారీ చేశారు. వారంలో ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే పెద్దిరెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బుధవారం ఉదయం ఆయన ఇంటి వద్దకు అధికారులు వెళ్లారు. పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న స్థలంలో కొలతలు చేపట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు వెను తిరిగి వెళ్లిపోయారు. దీంతో తదుపరి చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు.

కాగా తిరుపతి బుగ్గమఠం స్థలాన్ని ఆక్రమించారంటూ గతంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. తన ఇంటి కోసం బుగ్గమఠం స్థలంలో అక్రమంగా రోడ్డు నిర్మించి గేటు నిర్మాణం చేపట్టారని స్థానికుల ఫిర్యాదుతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. పెద్దిరెడ్డి ఏర్పాటు చేసిన రోడ్డు, గేటును తీసివేశారు. పెద్దిరెడ్డి హైకోర్టుకు వెళ్లినా ఎదురుదెబ్బ తగిలింది

Next Story

Most Viewed