దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతికి బెయిల్.. స్వల్ప ఊరట

by Vemula.Srinu Prasad |

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కుకుని విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్ అనుభవిస్తున్న దేవాదాయ శాఖ సస్పెండెడ్ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి న్యాయస్థానం నుంచి స్వల్ప ఊరట లభించింది. ..

దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతికి బెయిల్.. స్వల్ప ఊరట
X

దిశ, వెబ్ డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు(Disproportionate assets case)లో చిక్కుకుని విజయవాడ జిల్లా జైలు(Vijayawada District Jail)లో జ్యుడీషియల్ రిమాండ్(Judicial remand) అనుభవిస్తున్న దేవాదాయ శాఖ సస్పెండెడ్ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి న్యాయస్థానం నుంచి స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 23వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఆమెకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

అయితే గతంలో ఆమె దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం రెండుసార్లు తిరస్కరించినప్పటికీ, ఈసారి ప్రత్యేక కారణంతో బెయిల్ లభించింది. తన కుమార్తె స్కూల్ అడ్మిషన్ కోసం తమిళనాడులోని ఊటీకి వెళ్లాల్సి ఉందంటూ శాంతి తరపు న్యాయవాది కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తల్లిగా కూతురి విద్యా విషయాల కోసం వెళ్లాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, షరతులతో కూడిన ఐదు రోజుల బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ గడువు ముగిసిన వెంటనే శాంతి తిరిగి విజయవాడ జైలు అధికారుల ఎదుట హాజరుకావాలని కోర్టు తెలిపింది.

కాగా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేవలం కూతురి చదువు నిమిత్తం లభించిన 5 రోజుల విరామం ఆమెకు తాత్కాలిక ఉపశమనాన్ని కోర్టు కల్పించింది.

Next Story