- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో రెచ్చిపోతున్న కబ్జాదారులు.. ఖాళీ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు
తిరుపతిలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు..

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో కబ్జాదారులు(Occupiers) రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే గద్దాల్లా వాలిపోతున్నారు. దర్జాగా కోట్ల విలువైన స్థలాలు యదేచ్చగా ఆక్రమించేకుంటున్నారు. రోడ్డు స్థలం అయినా సరే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. చోట, మోటా అనే తేడా లేకుండా విలువైన స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఓ పార్టీకి చెందిన నేత తిరుచానూరు సర్కిల్ వద్ద నేషనల్ హై సర్వీసు రోడ్డు, పంచాయతి రోడ్డు సహా ఫ్రీ లెఫ్ట్ స్థలాన్ని కబ్జా చేశారు. అక్కడ భారీ హోటల్ నిర్మాణానికి పునాదులు వేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌కు స్లాబు కూడా పోస్తుతున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఫ్రీ లెఫ్ట్ స్థలాన్ని కబ్జా చేయడం, అందుకు సహరిస్తున్న నేతలపైనా ప్రజలు మండిపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.






