- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఏల విడుదలపై సస్పెన్స్.. సీఎంపైనే ఉద్యోగుల ఆశలు
తమ సమస్యల పరిష్కారంపై కేబినెట్ సభ్ కమిటీతో ఉద్యోగుల చర్చలు ముగిశాయి...

దిశ, వెబ్ డెస్క్: తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ చర్చలు జరిపింది. ప్రధానంగా 2018-19కు సంబంధించిన డీఏలు విడుదల చేయాలని మంత్రులను ఉద్యోగులు కోరారు. అలాగే పీఆర్సీ అంశాన్ని ప్రస్తావించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో త్రిసభ్య కమిటీ వేయాలని సూచించారు. 7 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అటు పోలీసుల సమస్యలపైనా మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు సిబ్బంది సరెండర్ లీవులు, పింఛనర్ల సమస్యలు పరిష్కరించాలని, అలాగే కారుణ్య నియామకాలు సైతం పూర్తి చేయాలని చెప్పారు. ముఖ్యంగా ఈ దీపావళికి రెండు డీఏలన్నా విడుదల చేయాలని మంత్రులకు సూచించారు. అయితే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులకు మంత్రులు తెలిపారు.






