- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Employees Transfer's: ఈ నెలలోనే ఏపీలో ఉద్యోగుల బదిలీలు?
ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలు ఈ నెలలోనే పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలు ఈ నెలలోనే పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు (Teachers) తప్ప ఉద్యోగులందరికీ మేలోనే సాధారణ బదిలీలను పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బదిలీలకు సంబంధించిన ఫైలు ఇప్పటికే సిద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు (Cm Chandrababu) ఆమోదం తర్వాత బదిలీలను నిర్వహిస్తారని సమాచారం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముందుగా రేషనలైజేషన్ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అది ముగిసిన తర్వాత బదిలీలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయ బదిలీలకు ప్రత్యేక బదిలీల చట్టాన్ని చేశారు. కొంతమంది ఈ చట్టంపై కోర్టుకి వెళ్లడతో కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇదే నెల 10వ తేదీన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూలు విడుదల అవుతుందని ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన టీచర్లు బదిలీల కోసం మెడికల్ సర్టిఫికెట్లను తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. అయితే ప్రిఫరెన్షియల్ కేటగిరిలో బదిలీల విధివిధానాలు సక్రమంగా లేవని ఉపాధ్యాయుల వాదన. దృష్టిలోపం ఉన్నవారు, వితంతు కోటాలోకి వచ్చే వారు బదిలీల్లో తమకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను తగ్గించారని అంటున్నారు. దానిని సరిచేయాలని కోరుతూ ఇప్పటికే కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జూన్ 15వ తేదీ వరకు ఉపాధ్యాయుల బదిలీల అంశంపై యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుండగా.. మిగిలిన ఉద్యోగుల బదిలీలు ఈ నెలలలోనూ పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నారు.






