BR Naidu:రేపు టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం.. కారణం ఇదే!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-07 14:15:37  IST  )

కలియుగ దైవం శ్రీవేంకటశ్వర స్వామివారు కొలువుదీరిన తిరుమల కొండకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు.

BR Naidu:రేపు టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం.. కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీవేంకటశ్వర స్వామివారు కొలువుదీరిన తిరుమల కొండకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీగా తిరుమలకు వస్తారు. ఈ తరుణంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుమలలో భక్తులకు ఏర్పాటు చేసిన సదుపాయాలపై టీటీడీ చైర్మన్ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా తిరుమల(Tirumala)లో రేపు(బుధవారం) టీటీడీ(TTD) పాలక మండలి అత్యవసర సమావేశం జరగనుందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనములో టీటీడీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. తిరుమలలో భక్తులకు కల్పించవలసిన సదుపాయాలు, సౌకర్యాల పై అధికారులకు టీటీడీ చైర్మన్ పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా తిరుపతిలోని అలిపిరి ప్రాంతంలో ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని రద్దుచేసి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేందుకు పాలకమండలిలో ప్రధాన అజెండాగా చేర్చనున్నారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుపతి రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్టాండ్ ల నుంచి శ్రీవారి మెట్టు మార్గానికి ఉచితంగా టీటీడీ ఎలక్ట్రికల్ బస్సులను నడిపేందుకు నిర్ణయించిన నేపథ్యంలో సుమారు 20 ఎలక్ట్రికల్ బస్సులను టిటిడి కి తెప్పించేందుకు పాలకమండలిలో ఆమోదం తెలుపనున్నారు.

Click For Tweet..

Next Story