అవసరమైనది తీసుకోండి అవసరం లేనిది పెట్టండి.. పోలీసుల వినూత్న ఆలోచన

by Naga Rani Yarlagadda |

నగరాలు, కొన్ని సిటీల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ ఫ్రిడ్జ్ లు ఉంటాయి. ఎవరి ఇంట్లోనైనా ఫుడ్, ఫ్రూట్స్ వంటివి మిగిలిపోతే తీసుకువచ్చి వాటిలో పెడితే ఆకలితో ఉన్నవారు వాటి నుంచి తీసుకుని తింటారు.

అవసరమైనది తీసుకోండి అవసరం లేనిది పెట్టండి.. పోలీసుల వినూత్న ఆలోచన
X

దిశ, వెబ్‌డెస్క్: నగరాలు, కొన్ని సిటీల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ ఫ్రిడ్జ్ లు ఉంటాయి. ఎవరి ఇంట్లోనైనా ఫుడ్, ఫ్రూట్స్ వంటివి మిగిలిపోతే తీసుకువచ్చి వాటిలో పెడితే ఆకలితో ఉన్నవారు వాటి నుంచి తీసుకుని తింటారు. ఆ తరహాలోనే ఏలూరు పోలీసులు వినూత్నంగా కైండ్ నెట్ వాల్ ను ఏర్పాటు చేశారు. అందులో దుస్తులు, ఆట వస్తువులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ ఉంచారు. వాటిలో ఎవరికైనా ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు. అలాగే ఎవరికైనా అక్కర్లేనివి అందులో పెడితే అవసరమైన వారు వాటిని తీసుకుంటారు. ఈ వాల్ వల్ల పేదలకు వారి అవసరాలు తీరుతాయని పోలీసులు భావిస్తున్నారు. వారు చేసిన ఈ చిరు ప్రయత్నాన్ని పలువురు అభినందించారు.

ఏలూరు టౌన్ లోని అమీనేపేట, లుండహరన్ చర్చ్, పోలీస్ భారత్ పెట్రోలియం బంక్ పక్క ఈ కైండ్ నెస్ వాల్ ను ఉంచారు. ఏలూరు వాసులు పైన చెప్పినవాటిలో అక్కర్లేనివి ఏవైనా ఉంటే బయట పడేయకుండా అక్కడ ఉంచితే మరొకరికి హెల్ప్ చేసినవారవుతారు.

Next Story