కైకలూరు కేంద్రంగా పసిపిల్లల విక్రయం.. పరారీలో నిందితుడు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-12 14:42:08  IST  )

ఏలూరు జిల్లా కైకలూరు కేంద్రంగా జరుగుతున్న పసిపిల్లల విక్రయం కలకలం రేపింది. ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన రెండున్నరేళ్ల బాలుడు ఆకేటి మోక్షిత్అదృశ్యమయ్యారు...

కైకలూరు కేంద్రంగా పసిపిల్లల విక్రయం.. పరారీలో నిందితుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా(Eluru District) కైకలూరు(Kaikaluru) కేంద్రంగా జరుగుతున్న పసిపిల్లల విక్రయం(Baby Sale) కలకలం రేపింది. ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన రెండున్నరేళ్ల బాలుడు ఆకేటి మోక్షిత్(Boy Aketi Mokshit) అదృశ్యమయ్యారు. 13 రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటున్న మోక్షిత్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కైకలూరు, ముదినేపల్లి సహా పలు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. స్థానిక సీసీ టీవీ ఫుటేజులను పరిశీలించారు. అయితే ఓ పార్టీ చెందిన నేత ఏఎన్.బాబుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పసిపిల్లలను విక్రయిస్తున్నాడని ఇప్పటికే ఏఎన్.బాబుపై చాలా ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణలో భాగంగా ఏఎన్.బాబు షాపు వద్దకు పోలీసులు వెళ్లారు. అయితే ఏ.ఎన్.బాబు పరారీ అయ్యాడు. దీంతో పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు.

Next Story