- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్యం జిల్లాలో ఏనుగుల స్వైర విహారం
పార్వతీపురం మన్యం జిల్లాలో (Manyam District) ఏనుగుల గుంపు (Elephants) స్వైర విహారం కొనసాగుతూనే ఉంది.

దిశ, వెబ్ డెస్క్ : పార్వతీపురం మన్యం జిల్లాలో (Manyam District) ఏనుగుల గుంపు (Elephants) స్వైర విహారం కొనసాగుతూనే ఉంది. ఏనుగుల స్వైర విహారం కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కురుపాం మండలంలోని కోకో, కర్బూజ పంటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత ఏడాది కాలంగా పైగానే ఏనుగుల దాడులు పెరుగుతున్నాయి. నానాటికీ పెరుగుతున్న దాడుల వల్ల జిల్లావాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల ఈ దాడులు తరచుగా జరుగుతున్నాయని చెబుతున్నారు. గతేడాది అక్టోబర్ నెలలోలో పార్వతీపురం రూరల్ మండలం పెద్ద బొండపల్లిలో పొలంలో పనిచేస్తున్న రైతు దేవాభత్తుల యాకోబుపై ఏనుగులు దాడి చేసి చంపడం జిల్లా వాసులను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనతో పాటు వందలాది ఎకరాల్లో పంటలు, కొబ్బరి తోటలు ధ్వంసం కావడంతో రైతులు భారీగా నష్టపోయానే. అదే ఏడాది నవంబరు నెలలో నర్సిపురం సమీపంలో సుమారు రెండు వందల కొబ్బరి చెట్లను ఏనుగులు నేలమట్టం చేశాయి. దీంతో కొబ్బరి రైతు కన్నీరుమున్నీరు అయ్యారు.
ఈ ఏడాది జనవరిలో కూడా జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లో ఏనుగుల సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. కోటిపాం పాత గేటు అంతరాష్ట్ర రహదారి సమీపంలో ఏనుగులు తిరగడంతో ప్రయాణికులు, పొలం పనులు చేసుకునే రైతులు భయంతో వణికిపోయారు. ఏనుగుల సంచారంతో ప్రజలు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు బయటికి రాకూడదని జిల్లా అటవీశాఖ అధికారి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇటీవల అటవీశాఖ అధికారులు సరైన ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట నష్టాలతో పాటు, ప్రాణ నష్టం కూడా జరగడంతో మన్యం జిల్లా వాసులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కుంకీ ఏనుగుల సహాయంతో ఏనుగుల గుంపును తరలించాలని ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అవి ఇంకా పూర్తిగా ఫలించలేదని పేర్కొంటున్నారు. రైతులు, స్థానికులు తమ ప్రాణాలను, ఆస్తులను కాపాడాలని, ధ్వంసమైన పంటలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.






