- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ధాన్యం బస్తాలు ధ్వంసం
మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగువలసలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ...

X
దిశ, వెబ్ డెస్క్: మన్యం జిల్లా(Manyam District) కొమరాడ మండలం గంగరేగువలస(Gangareguvalasa)లో ఏనుగులు(Elephant) బీభత్సం సృష్టించాయి. రాత్రి అటవీ ప్రాంతంలో నుంచి జనారణ్యంలోకి వెళ్లాయి. రైతులు(Farmers) పండించిన ధ్యాన్యాన్ని ధ్వంసం చేశాయి. పంట చేతికి రావడంతో గంగరేగువలసలో రైతులు ధాన్యం బస్తాలు ఓ రేకుల రూమ్‌లో నిల్వ చేశారు. అయితే ఏనుగులు రేకులు రూమ్‌ను ధ్వంసం చేయడంతో పాటు ధాన్యం బస్తాలను చిందరవందరగా పడేశాయి. ఇష్టమొచ్చినట్లు స్థానికంగా నానా యాగీ చేశాయి. భారీ శబ్ధంతో ఘీంకారాలు చేశాయి. దీంతో రైతులు భయాందోదోళన చెందుతున్నారు. తరచూ గ్రామంలోకి ఏనుగులు వస్తున్నాయని, గతంలో చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






