తిరుపతి జిల్లాలో 14 ఏనుగుల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు

by Vemula.Srinu Prasad |

తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి....

తిరుపతి జిల్లాలో 14 ఏనుగుల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District)లో ఏనుగులు(Elephants) బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటపొలాలను ధ్వంసం చేస్తున్నారు. తరిమేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయి. తిరగబడి దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో రైతులు తమ పొలాల వైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. తాజాగా 14 ఏనుగుల గుంపు చంద్రగిరి మండలం ఏ రంగం పేటలో తిష్టవేశాయి. 12 ఏనుగులు భారీ కాయంతో ఉండగా రెండు గున్న ఏనుగులు (చిన్న పిల్లలు) శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వచ్చి స్థానిక పొలాల్లో బీభత్సం సృష్టించాయి. పంటలను ధ్వంసం చేస్తూ హల్ చల్ చేస్తున్నాయి. రాత్రి సమయంలో ఘీంకారాలు చేస్తున్నాయి. దీంతో స్థానిక గ్రామల ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండిపోయారు. అటవీ శాఖకు సమాచారం అందించారు. అయితే అధికారులు చర్యలు చేపట్టారు. డ్రోన్లతో నిఘా పెట్టారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమేవరకు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు.

Next Story