- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap News: కరెంట్ బిల్ చూసి గుండె గుబేల్
మధ్య తరగతి కుటుంబానికి విద్యుత్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు..

దిశ, వెబ్ డెస్క్: రూ.1000 కరెంట్ బిల్లు(Current Bill) వస్తేనే వామ్మో అనే రోజులివి. అటువంటిది ఓ ఇంటికి ఏకంగా రూ. లక్షా 60 వేలు విద్యుత్ బిల్లు వచ్చింది. దీంతో ఆ కుటుంబం లబోదిబో అంటోంది. ఇంత బిల్లు ఎలా కట్టాలి దేవుడా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మధ్య తరగతి కుటుంబానికి(middle class family) విద్యుత్ అధికారులు భారీ షాక్ ఇచ్చిన ఘటన అనకాపల్లి జిల్లా(Anakapalli District)లో జరిగింది.
రావికమతం మండలం డోలావానిపాలెం(Dolavanipalem)లో ప్రతి నెల మాదిరి విద్యుత్ సిబ్బంది(Electricity authorities) ఇంటికి తిరిగి ఈ నెల కూడా కరెంట్ బిల్లులు ఇచ్చారు. అయితే గుండెలు గుబెల్ అనేలా ఓ ఇంటికి కరెంట్ బిల్లు వేశారు. అక్షరాల లక్షా 60 వేల రూపాయల బిల్లును ఆ ఇంటి యజమానికి అందజేశారు. మరో ఇంటికి రూ. 23,913 విద్యుత్ బిల్లు ఇచ్చారు. రెండో చోట్ల ఇంటి యజమానులు మహిళలే కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత కరెంట్ ఎలా చెల్లించాలంటూ గుండెలు బాదుకుంటున్నారు. కరెంట్ బిల్లును విద్యుత్ అధికారులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.






