- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై తిరుమల రూట్లో ఎలక్ట్రికల్ వాహనాలు మాత్రమే!
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఇకపై తిరుమల రూట్లో ఎలక్ట్రికల్ వాహనాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తామని టీటీడీ ఆలయ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఇకపై తిరుమల రూట్లో ఎలక్ట్రికల్ వాహనాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తామని టీటీడీ ఆలయ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. టీటీడీ పాత పెట్రోల్-డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రికల్ వాహనాల సంఖ్యను మరింత పెంచే చర్యలను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. తిరుపతి–తిరుమల మార్గంలో పూర్తిగా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడంతోపాటు.. తిరుమలలో నడిచే ట్యాక్సీలు, అద్దె వాహనాలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేస్తామని తెలిపారు.
సీఎం చంద్రబాబు సూచనల మేరకు తిరుమలను కాలుష్యరహిత పుణ్యక్షేత్రంగా మార్చేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మార్పుపై ఓ ప్రయివేట్ సంస్థ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా, దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనలపై త్వరలో జరగనున్న టీటీడీ పాలకమండలి సమావేశంలో గ్రీన్ సిగ్నల్ రానుందని సమాచారం.






