Breaking News: చంద్రబాబుకు నోటీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-04-04 14:46:16  IST  )

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది...

Breaking News: చంద్రబాబుకు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31 ఎమ్మిగనూరులో ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని సూచించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఫిర్యాదుతో నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

కాగా ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫెక్సీలను తొలగించారు. అంతేకాదు ఎన్నికల నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని ఈసీ ఆదేశించింది. ఎవరు అతిక్రమించినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయినా సరే నేతలు ఎన్నికల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తోంది.

Next Story