విషాదం.. కుందూ నదిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

by Vemula.Srinu Prasad |

కుందూ నదిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం చేశారు..

విషాదం.. కుందూ నదిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: అనారోగ్యం భరించలేక వృద్ధ దంపతులు(Elderly couple) ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కడప జిల్లా(Kadapa District)లో చోటు చేసుకుంది. రాజుపాలెం మండలం వెల్లాల(Vellala)కు చెందిన 79 ఏళ్ల రామసుబ్బారెడ్డి, నాగమునెమ్మ(75) దంపతులు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ అనారోగ్య సమస్యలు ఇటీవల కాలంలో మరింతగా పెరిగాయి. దీంతో దంపతులిద్దరూ తట్టుకోలేకపోయారు. దీనికి చావే పరష్కారం అనుకున్నారు. స్థానికంగా ఉన్న కుందూనదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే రామసుబ్బారెడ్డిని స్థానికులు రక్షించారు. కానీ నాగమునెమ్మ నదిలో కొట్టుకుపోయారు. దీంతో ఆమె కోసం గాలిస్తున్నారు.

Next Story